వక్క రైతుల గొంతు నొక్కి!
కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది.
- కర్ణాటక కర్షకులపై కేంద్రం పిడుగు
- భూటాన్ నుంచి వక్కల దిగుమతి
- గుజరాత్ వ్యాపారుల లబ్ధి కోసమే!
- తమ పరిస్థితి ఏమిటని రైతుల ఆందోళన
బెంగళూరు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది. గతంలో దిగుమతి చేసుకొనే వకకు కనీస ధర కిలోకు రూ.251గా నిర్ణయించారు. దీనివల్ల దేశీయ రైతులకు మంచి డిమాండ్ ఉండేది. కానీ, మోదీ సర్కారు కనీస ధర ఆంక్ష నిబంధనను రద్దు చేసింది. భూటాన్ నుంచి 17 వేల టన్నుల పచ్చి వక్క దిగుమతికి అనుమతించింది. ఇది వక్కలు పండించే దేశీయ రైతుల పాలిట పిడుగుపాటని వ్యవసాయ, వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వ కథనం ప్రకారం.. తొలిసారిగా భూటాన్ నుంచి వకను దిగుమతి చేసుకొంటున్నారు.
ఇప్పటి వరకు ఒక దేశం నుంచి ఈ స్థాయిలో వకను దిగుమతి చేసుకొన్న దాఖలాలు లేవు. నిరుడు ఆ దేశం నుంచి దిగుమతి చేసుకొన్న వక 4 వేల టన్నులు. ఈ ఏడాది ఒకసారిగా 4 రెట్ల కంటే ఎకువ వక దిగుమతికి అనుమతివ్వటాన్ని దేశ రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. కేంద్రం విధానం వక రైతుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టని వక, కోకో మారెటింగ్, ప్రాసెసింగ్ సహకార సంఘం అధ్యక్షుడు కిశోర్ తెలిపారు. ‘వక దిగుమతులకు తలుపులు తెరవటం దేశీయ వకల ధరలను ప్రభావితం చేయనున్నది. దేశంలో 8-10 లక్ష టన్నుల వకలు పండుతున్నాయి. ఇది దేశీయ అవసరాలను తీరుస్తున్నది. మిగులు వక్కలను ఎగుమతి కూడా చేయవచ్చు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వక తోటలు విస్తరించాయి. వచ్చే నాలుగైదేండ్లలో మొత్తం పంట దిగుబడి 15 లక్షల టన్నులకు చేరవచ్చు’ అని తెలిపారు.
నాడు పట్టును కూడా..
గుజరాత్ వ్యాపారుల ప్రయోజనాలకే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అకడి పట్టు వ్యాపారుల కోసం వాజపేయి ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకొనే బై వోల్టిన్ పట్టుపై సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పట్టు రైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఫలితంగా ఇప్పుడు ఈ రాష్ర్టాల్లో మల్బరీ తోటల విస్తీర్ణం, పట్టు దిగుమతి తగ్గుముఖం పడుతున్నది. ఇప్పుడిక వకకూ ఇదే గతి తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టు దిగుమతి సుంకాన్ని తగ్గించటం వల్ల నష్టపోయిన రైతుల్లో అత్యధికులు కర్ణాటక వారే. ఇప్పుడు వకల దిగుమతి కనీస ధరను రద్దు చేయటంతో నష్టపోయేది కర్ణాటక రైతులే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

