న్యూఢిల్లీ: వచ్చే ఏడాది తొలి దశలోనే జనాభా లెక్కల ప్రక్రియ మొదలుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలువ ఎల్లడించాయి. జాతీయ జనాభా రిజాస్టర్ను త్వరలోనే అప్డేట్ చేయనున్నారు. 2026 నాటికి జనాభా లెక్కల వివరాలను వెల్లడించనున్నారు. సాధారణ జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపడుతారా లేదా అన్న విషయంపై ప్రభుత్వ వర్గాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 1951 నుంచి పదేశ్లకు ఒకసారి జనాభా లెక్కిస్తున్న విషయం తెలిసిందే. 2021లో కోవిడ్ వల్ల జనాభా లెక్కలింపు ప్రక్రియ జరగలేదు. అయితే జనాభా లెక్కింపుకు చెందిన షెడ్యూల్ను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కింపు ప్రారంభం కావడం వల్ల.. ఆ సైకల్ మారే అవకాశాలు ఉన్నాయి.. 2025 నుంచి 2035, ఆ తర్వాత 2035 నుంచి 2045 అన్న రీతిలో లెక్కింపు ప్రక్రియ మారుతుందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. జనాభా లెక్కింపు సమయంలో పౌరులను అడిగే 31 ప్రశ్నలను రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ తయారు చేశారు. ఇంటి యజమాని షెడ్యూల్ కులం, తెగకు చెంది ఉంటారా అనే ప్రశ్న వేయనున్నారు.
ఓబీసీ జనాభాను తెలుసుకునేందుకు కుల గణన చేపట్టాలని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా లెక్కింపు తర్వాత పార్లమెంట్ నియోజవకర్గాల పునర్ విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనాభా నియంత్రలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్ విభజిస్తే, అప్పుడు ఆర్టికల్ 82కు సవరణ చేపట్టాల్సి ఉంటుంది.