భోపాల్: క్లాస్‌రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. (Ceiling Fan Falls On Girl) ఒక బాలికపై పడటంతో ఆమె గాయపడింది. ఇది చూసి టీచర్, విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్లోని క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్‌కు టీచర్ లెసెన్స్ చెబుతోంది. ఇంతలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఒక బెంచ్ చివర కూర్చొన్న బాలిక సమీపంలో అది పడింది. ఫ్యాన్ రెక్కలు ఆ బాలిక ముఖానికి తగిలాయి. అయితే ప్రతిస్పందనగా ఆమె తన చేతిని పైకి లేపింది. దీంతో మరింత గాయం కాకుండా ఆ బాలిక తప్పించుకుంది.
కాగా, క్లాస్‌లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటం చూసి టీచర్, స్టూడెంట్స్ షాక్ అయ్యారు. ఉపాధ్యాయురాలు పరుగున ఆ బాలిక వద్దకు వెళ్లింది. గాయపడిన ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ విద్యార్థిని కోలుకుంటున్నట్లు ఆ స్కూల్ పేర్కొంది.
మరోవైపు క్లాస్‌రూమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచించారు.
Definitely got to be my worst nightmare 😨 poor girl rushed to the hospital, thankfully doing ok
*Fan falls off ceiling inside classroom at private school in MP's Sehore. The girl lifted her hand briefly when the fan blade struck her, saving her face pic.twitter.com/wap8denJGv
— Nabila Jamal (@nabilajamal_) July 14, 2024