పాట్నా, అక్టోబర్ 5: బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పూర్తి కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఆదివారం సంతృప్తి వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల తర్వాత బీహార్లో ఓటర్ల జాబితాను ‘సర్’ ప్రక్షాళణ చేసిందని ఆయన అభివర్ణించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో తన పర్యటన ముగింపును పురస్కరించుకుని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలలో ఒకరు చొప్పున ఓటరు నమోదు అధికారి(ఈఆర్ఓ) ఉన్నారని చెప్పారు. ఎస్ఐఆర్ని పూర్తి చేయడంలో వారికి 90,207 మంది బీఎల్ఓలు సాయపడ్డారని ఆయన తెలిపారు.