CDSCO | న్యూఢిల్లీ: దేశంలో పారాసిటమాల్, పాన్ డి, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిక్ సహా 50కి పైగా మందులు నాసిరకంగా ఉన్నాయని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) తాజా నివేదిక వెల్లడించింది. ఆగస్టు నెలకు గాను విడుదల చేసిన ఈ నివేదికలో షెల్కాల్, విటమిన్ సి సాఫ్ట్జెల్స్తో కూడిన విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి అండ్ డీ3, సిప్రోఫ్లోక్సాసిన్ తదితర ఔషధాలూ తగిన నాణ్యత లేనివిగా తేలాయి.
అధిక రక్తపోటుకు వాడే టెల్మిసర్టాన్, ఆట్రోపైన్ సల్ఫేట్, అమోక్సీసిల్లియన్, పొటాషియం క్లావులనేట్ కూడా నాసిరకంగా ఉన్నట్టు తెలిసింది. నాణ్యత లేని ఔషధాల అలర్ట్ డాటాను ఆగస్టు నెలకు తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు సమర్పించలేదని సీడీఎస్సీవో తెలిపింది.