న్యూఢిల్లీ, జూలై 23 : ప్రతి సెక్షన్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ప్రతి సెక్షన్‌కు 45 మంది విద్యార్థుల వరకు చేర్చుకోవచ్చునని సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా 40 మంది విద్యార్థులు ఉండే సెక్షన్లో అసాధారణ పరిస్థితుల్లో 45 మంది వరకు అనుమతించవచ్చునని తెలిపింది. తరగతుల్లో ఎట్టి పరిస్థితుల్లో 45 మంది విద్యార్థులకు మించి, అది అసాధారణ పరిస్థితులైనా ప్రవేశం కల్పించరాదని ఆదేశాలు జారీ చేసింది.