కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్‌కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీలు చేసింది.
దోషికి మరణ శిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టుకు తెలిపింది. తాను లేదా కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీనిపై అప్పీలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.