అమెరికాలో అదానీపై కేసులు గాయబ్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. సోలార్ కాంట్రాక్టుల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై మోపిన క్రిమినల్, సివిల్ ఫ్రాడ్ అభియోగాలను ఉపసంహరించుకొన్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
- ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన ట్రంప్ సర్కారు
- యూఎస్‌లో అదానీ భారీ పెట్టుబడులు పెట్టడం వల్లేనా?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. సోలార్ కాంట్రాక్టుల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై మోపిన క్రిమినల్, సివిల్ ఫ్రాడ్ అభియోగాలను ఉపసంహరించుకొన్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌తో పాటు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కేసులను వెనక్కి తీసుకొన్నట్టు ప్రకటించాయి. అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కోర్టులో కేసుల కారణంగా దీనికి ముందడుగు పడటం లేదని గత నెలలో అదానీ న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అదానీపై కేసుల విషయంలో వెనక్కి తగ్గడం గమనార్హం. కాగా ఈ స్కామ్‌లో అదానీకి నోటీసులు జారీచేయడానికి తమకు సాయం చేయడంలేదంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఎస్ఈసీ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఏమిటీ కేసు?
తమ సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఆమోదించేందుకు గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌లోని వివిధ రాష్ర్టాల ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,567 కోట్లు) ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చాయి. రానున్న 20 ఏండ్లలో రూ. 20 వేల కోట్లు లాభాలు గడించాలన్న లక్ష్యంతో ఈ లంచాలకు తెరతీసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై అదానీపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎస్ఈసీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

