న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జస్టిస్ వర్మ నివాసంలో కరెన్సీ కట్టలు దొరికినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను దాఖలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. ‘ఈ అంశం గురించి ప్రజలు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు.
డబ్బు లావాదేవీలు, అది ఎక్కడి నుంచి మొదలైంది, దాని ఉద్దేశం ఏమిటి? న్యాయ వ్యవస్థను అది కలుషితం చేసిందా? ఎవరు పెద్ద తిమింగలం? దానిని మనం కనుక్కోవాలి. ఇప్పటికే రెండు నెలలు గడచిపోయాయి. వేగంగా దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది’ అని ధన్ఖడ్ చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను విచారించాలంటే, ముందుగా అనుమతి పొందాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు