బెంగళూరు, నవంబర్ 5: కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదైంది. మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తనను కుమారస్వామి బెదిరించారంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా, తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ‘హాస్యాస్పదం, హానికరం’ అని కుమారస్వామి పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.సీఎంగా ఉన్న సమయంలో కుమారస్వామి 2006-08 మధ్య 550 ఎకరాలను అక్రమంగా ఒక కంపెనీకి లీజుకు ఇచ్చారన్న ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతున్నది.