BJP MLA | భూ ఆక్రమణ వివాదం కేసులో (Land Encroachment Case) కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) హరీశ్ పూంజాపై (Harish Poonja) ఎఫ్ఐఆర్ నమోదైంది. భూ ఆక్రమణ కేసుపై చర్చిస్తున్న సమయంలో ఫారెస్ట్ అధికారిపై అసభ్యకర పదజాలంతో దూషించాడన్న (Abusing) ఆరోపణలతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దక్షిణ కన్నడ ఎస్పీ సీబీ రిష్యంత్ వెల్లడించారు.
కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలోని నిషిద్ధ మండలంలో అటవీ భూమిని లోలాక్ష్ గౌడ అనే వ్యక్తి ఆక్రమించాడు. ఆ స్థలంలో భవన నిర్మాణానికి పునాది వేశారు. అయితే అక్కడ భవనం నిర్మించేందుకు అటవీ అధికారులు అనుమతించలేదు. దీంతో లోలాక్ష్ గౌడ తరఫున ఎమ్మెల్యే హరీశ్ పూంజా అటవీ అధికారులతో చర్చించారు. ఈ చర్చ ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. అటవీశాఖ అధికారి జయప్రకాశ్ని అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన అక్టోబరు 7వ తేదీన జరగ్గా.. అక్టోబర్ 13వ తేదీన ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ సీబీ రిష్యంత్ తెలిపారు. అటవీ అధికారి ఫిర్యాదు మేరకు 143, 353, 504, 149 కింద ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Rice Export | కేంద్రం కీలక నిర్ణయం.. ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి అనుమతి
Joe Biden | ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO