Joe Biden | ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
Joe Biden | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బైడెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు.
Joe Biden | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బైడెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్వాగతం పలికారు.
కాగా, హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.
అరబ్ నేతలతో బైడెన్ భేటీ రద్దు..
మరోవైపు, బైడెన్ (Joe Biden) జోర్డాన్ (Jordan) పర్యటన రద్దైంది. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత బైడెన్ జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్ నేతలతో (Arab Leaders) సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. అయితే, నిన్న గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో (Gaza Hospital Strike) అనూహ్యంగా బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైంది. బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైనట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
Also Read..
Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO
Israel-Hamas War | గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రచర్యే.. ఈ ఘటనతో ఐడీఎఫ్‌కు సంబంధం లేదు : ఇజ్రాయెల్
Joe Biden | అరబ్ నేతలతో బైడెన్ భేటీ రద్దు.. ప్రకటించిన జోర్డాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

