Joe Biden | అరబ్ నేతలతో బైడెన్ భేటీ రద్దు.. ప్రకటించిన జోర్డాన్
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జోర్డాన్ (Jordan) పర్యటన రద్దైంది. హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ఇవాళ యుద్ధ భూమిలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జోర్డాన్ (Jordan) పర్యటన రద్దైంది. హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ఇవాళ యుద్ధ భూమిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత బైడెన్ జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, నిన్న గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో (Gaza Hospital Strike) అనూహ్యంగా బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైంది.
బైడెన్ నేడు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్ నేతలతో (Arab Leaders) సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైనట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, గాజా ఆసుపత్రి ఘటనపై బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలియగానే జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు.
Also Read..
Israel-Hamas War | గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రచర్యే.. ఈ ఘటనతో ఐడీఎఫ్‌కు సంబంధం లేదు : ఇజ్రాయెల్
Joe Biden | నేడు ఇజ్రాయెల్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గాజా దవాఖానపై దాడి 500 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

