Watch: రైల్వే క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యంగా కారును నిలిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే
Car Narrowly Avoids Collision With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల సమీపంలో నిర్లక్ష్యంగా కారును ఒక వ్యక్తి నిలిపి ఉంచాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళ్లింది. రైలు పట్టాలు, గేట్ మధ్య కారు ఉండటంతో ట్రైన్ లోకోపైలట్ చాలా నెమ్మదిగా రైలు నడిపాడు.
లక్నో: రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల సమీపంలో నిర్లక్ష్యంగా కారును ఒక వ్యక్తి నిలిపి ఉంచాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళ్లింది. రైలు పట్టాలు, గేట్ మధ్య కారు ఉండటంతో ట్రైన్ లోకోపైలట్ చాలా నెమ్మదిగా రైలు నడిపాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు, గేట్ మధ్య నిలిపి ఉంచిన కారుకు ఎలాంటి నష్టం జరుగలేదు. (Car Narrowly Avoids Collision With Train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. రైల్వే గేటు వేస్తుండగా ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కారు రైలు పట్టాల మధ్యకు చేరుకుంది. గేటు మూసుకుపోవడంతో డ్రైవర్ ఆ కారును రైలు పట్టాలు, గేటు మధ్యలో పార్క్ చేశాడు. ఇంతలో రైలు పట్టాల మీదుగా ట్రైన్ వెళ్లింది. అయితే రైలు పట్టాలకు చాలా దగ్గరగా ఉన్న ఆ కారుకు ఎలాంటి నష్టం జరుగలేదు.
కాగా, సురభ్ అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు మనం దానిని (కారును రైలు ఢీకొట్టకపోవడాన్ని) క్లోజ్ ఎస్కేప్ అని పిలుస్తాము. అయితే ఆ రైలు కారుకు కనీసం కొంత నష్టమైనా కలిగించాలని నాలో సగ భాగం కోరుతోంది. తెలివితక్కువ కారు డ్రైవర్‌కు గొప్ప గుణపాఠంగా ఉండేది’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రైలు పట్టాలు, గేటు మధ్య నిర్లక్ష్యంగా కారు నిలిపిన డ్రైవర్ తీరుపై మండిపడ్డారు. ఒకవేళ కారును రైలు ఢీకొట్టి ఉంటే అక్కడున్న వారికి ప్రమాదం జరిగి ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ కారు యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
Now that’s what we call a close escape 😂
Also, A part of me wanted the train to give atleast some damage to the car, it would have been a great lesson to the stupid car owner.#indianrailways pic.twitter.com/A5ODUW4Uhh
— Saurabh • A Railfan 🇮🇳 (@trainwalebhaiya) January 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

