అహ్మదాబాద్: మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేశాడు. ఆటోను తప్పించబోయి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో గాల్లోకి లేచిన ఆ కారు అవతల రోడ్డులోకి జంప్ చేసింది. (Car Jumps Divider) ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టింది. దానిపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేళ నరోడా-దేహ్గామ్ రోడ్డులో హ్యుందాయ్ క్రెటా కారు వేగంగా ప్రయాణించింది. ముందున్న ఆటోను ఓవర్ టేక్ చేసేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించాడు.
కాగా, ఆ కారు అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూకి అవతల రోడ్డులోకి వెళ్లింది. కొన్ని సెకన్లు గాలిలో ఉన్న ఆ కారు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణించిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి మరణించారు.
మరోవైపు ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే కారు వద్దకు వెళ్లారు. కారును ర్యాష్‌గా డ్రైవ్ చేసిన డ్రైవర్ గోపాల్ పటేల్‌ను పట్టుకుని కొట్టారు. ఈ ప్రమాదం గురించి తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు.
కాగా, కారు డ్రైవర్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను 26 ఏళ్ల అమిత్ రాథోడ్, 27 ఏళ్ల విశాల్ రాథోడ్‌గా గుర్తించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
અમદાવાદમાં પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડી, સામેથી આવતા એક્ટિવાને અડફેટે લેતા બેનાં મોત#CGNews #Ahmedabad #Overspeed #Car #Caraccident #Activa #CCTV #AhmedabadNews pic.twitter.com/uvDr3nlTQ0
— ConnectGujarat (@ConnectGujarat) December 2, 2024