ముంబై: కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. (Car crashes through wall) ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. విమన్ నగర్లోని శుభ గేట్వే అపార్ట్మెంట్లో వాహనాల పార్కింగ్ కోసం మొదటి అంతస్తులో స్థలం ఉంది. ఆదివారం ఉదయం బ్లాక్ కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే రివర్స్ గేర్ వేయడంతో నియంత్రణ కోల్పోయాడు. దీంతో మొదటి అంతస్తులో ఉన్న పార్కింగ్ ప్రాంతంలోని గోడను ఆ కారు ఢీకొట్టింది. గోడ పగలడంతో ఎత్తు నుంచి అది కిందపడింది. ఆ సమయంలో అక్కడున్న వారు వెంటనే స్పందించారు. నిటారుగా పడిన కారులో చిక్కుకున్న డ్రైవర్ బయటకు వచ్చేందుకు సహకరించారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పార్కింగ్ ఏరియాలోని గోడ నాణ్యతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కారు పడిన చోట ఎవరైనా ఉంటే వారి పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నించారు.
Don’t try to drive/park like James Bond.
Incident at Shubh Gateway Apartment, Viman Nagar in Pune. pic.twitter.com/v9NOmP3csm
— Ashok Bijalwan अशोक बिजल्वाण 🇮🇳 (@AshTheWiz) January 21, 2025