Car Catches Fire | కర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
మంగళూరులోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పెట్రోల్ పంప్ సిబ్బంది.. బకెట్లతో నీళ్లు పోస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
A Maruti 800 caught fire at a petrol pump in Lady Hill, Mangaluru, on Sunday, creating a moment of panic pic.twitter.com/kq80wvV9Xf
— News Karnataka (@Newskarnataka) November 11, 2024
Also Read..
Donald Trump | మనవరాళ్లతో కలిసి గోల్ఫ్ ఆడిన ట్రంప్.. అంకుల్ అయిన మస్క్
Air Pollution | ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం.. రాజధానిని కమ్మేసిన పొగమంచు
Siddaramaiah | ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సవాల్