CAR T-Cell therapy | క్యాన్సర్ థెరపీని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
CAR T-Cell therapy | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
CAR T-Cell therapy | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించకపోవడమే మరణాలకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోనూ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. భారత్‌లోనూ చాలామందిలో క్యాన్స్ చివరి స్టేజ్‌లోనే నిర్ధారణ అవుతున్నది.
ఈ క్రమంలో రోగులకు చికిత్స చేసి ప్రాణాలను కాపాడడం కష్టంగా మారుతున్నది. అయితే, బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సరికొత్త చికిత్స విధానాన్ని పరిచయం చేసింది. క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా కార్ టీ సెల్ థెరపీని తీసుకురాగా.. పోవైలో ఏర్పాటు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స విధానం పలు రకాల క్యాన్సర్లను నయం చేయడంలో సహాయపడనున్నది.
ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 2019లో భారత్‌లో దాదాపు 12లక్షల కొత్త క్యాన్స్ కేసులుండగా.. 9.3లక్షల మరణాలు రికార్డయ్యాయి. కార్ టీ సెల్ థెరపీ క్యాన్సర్ చికిత్సలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ కార్19 కార్ టీ సెల్ థెరపీని భారత్ తొలి కార్ట్ టీ సెల్ థెరపీ కాగా.. ఇది చికిత్స ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఈ కొత్త థెరపీ సహాయంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభతరం అవుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

