Amartya Sen | ఎలక్టోరల్ బాండ్ల రద్దుతో ఎన్నికల్లో మరింత పారదర్శకత : ఆర్థికవేత్త అమర్త్యసేన్
Amartya Sen | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. సుప్రీం నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ సోతం ఎలక్టోరల్ బాండ్ పథకం రద్దును స్వాగతించారు.
Amartya Sen | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. సుప్రీం నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ సోతం ఎలక్టోరల్ బాండ్ పథకం రద్దును స్వాగతించారు. ఈ పథకాన్ని ఓ కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అమెరికాలోని మసాచుసెట్స్లో ఆయన పీటీఐతో మాట్లాడారు. ఈ చర్య ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘ఎలక్టోరల్ బాండ్లు ఓ కుంభకోణం.. దాన్ని రద్దు చేసినందుకు సంతోషంగా ఉన్నాను’ అన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీం రద్దు చేసింది. స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దాతలు, బాండ్ల విలువ తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. రాజకీయ విరాళాల్లో పారదర్శకత తీసుకురావడం, నల్లధనాన్ని అరికట్టడమే ఈ పథకం లక్ష్యమన్న కేంద్రం వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. పథకాన్ని రద్దు చేయాలన్న కోర్టు.. 2019 ఏప్రిల్ 12 నుంచి మార్చి 6 2024 వరకు ఈ స్కీమ్ ద్వారా ఎస్బీఐ నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్కు అందజేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

