Delhi | ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలినట్లు ఫోన్ కాల్..!
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే, ఎంబసీ సమీపంలోని ప్రజలకు పెద్ద శబ్దం వినిపించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ ధ్రువీకరించింది. సాయంత్ర 5.47 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని, చాణక్యపురిలో ఎంబసీ వద్దకు వెళ్లినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. అక్కడ తనిఖీలు చేపట్టామని, పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదని చెప్పారు. అయితే, తప్పుడు సమాచారంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2021లో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద స్వల్ప తీవ్రతతో బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఈ కేసుపై ఇప్పటికీ ఎన్ఐఏ విచారణ జరుపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

