న్యూఢిల్లీ : చిన్న మొత్తంలోని యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీంతో రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదు. ఆ లావాదేవీలపై వ్యాపారులకు మనం చెల్లించాల్సిన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను ప్రభుత్వమే భరిస్తుంది. రూ.2 వేలు లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన ప్రతి యూపీఐ లావాదేవీపై వ్యాపారులకు ప్రభుత్వం 0.15% మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందజేస్తుంది. ఈ పథకం ఈ ఏడాది మార్చి 31 వరకు అమలవుతుంది.