న్యూఢిల్లీ, జనవరి 2: పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) నిబంధనలను లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే నోటిఫై చేస్తామని ఓ అధికారి చెప్పారు. నిబంధనలను నోటిఫై చేయగానే ఆటోమెటిక్‌గా చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు.
అమల్లోకి రాగానే అర్హులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, పరిశీలించి పౌరసత్వాన్ని మంజూరు చేస్తామని వెల్లడించారు.