న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఇవాళ కీలక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు(CAA)కు చెందిన సవరణ నోటిఫికేషన్ హోంశాఖ రిలీజ్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏను అమలు చేస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. సీఏఏ ఈ దేశానికి చెందిన చట్టమని అని, దాన్ని కచ్చితంగా నోటిఫై చేస్తామని ఆయన గతంలో అన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి వలస వచ్చినవాళ్లకు మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును 2019 డిసెంబర్లో క్లియర్ అయ్యింది. సీఏఏ పౌరసత్వాన్ని ఇస్తుందని, కానీ పౌరసత్వాన్ని లాక్కోదు అని షా తెలిపారు. అయితే కొందరు నేతలు మాత్రం సీఏఏను ఇప్పట్లో తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని పేర్కొన్న విషయం తెలిసిందే.