న్యూఢిల్లీ: మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మతాలకు చెందిన సభ్యులు పాస్‌పోర్టు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేనప్పటికీ దేశంలోనే ఉండడానికి అనుమతిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది.
ఈ ఉత్తర్వు పెద్ద సంఖ్యలో మైనారిటీలు ముఖ్యంగా 2014 తర్వాత భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న పాకిస్థాన్ హిందువులకు భారీ ఊరట కలిగించనున్నది.