Bus Falls Into Ditch | లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Bus Falls | లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ నుంచి పైకి తీసుకొచ్చారు.
డెహ్రాడూన్: ఒక బస్సు లోయలో పడింది (Bus Falls Into Ditch). ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం ముస్సోరీ-డెహ్రాడూన్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుషెర్గాడి ప్రాంతంలో అదుపుతప్పింది. రోడ్డు నుంచి లోయలోకి ఆ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు బాలికలు మరణించారు. బస్సు డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
కాగా, లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ నుంచి పైకి తీసుకొచ్చారు. లాండూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డెహ్రాడూన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ముస్సోరీ మార్గంలోని షెర్గాడి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిందని ముస్సోరీ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు లోయలోకి దూసుకెళ్లిన బస్సుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot.
More Details awaited. pic.twitter.com/LZWvg3riML
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023
Also Read:
Gunned Down | పలు కేసులున్న బీజేపీ నేత.. దుండగుల కాల్పుల్లో మృతి
KTR | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

