కారేపల్లి, ఆగస్టు 08 : కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్ నాయనమ్మ లకావత్ అంజి (101) శనివారం తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు లకావత్ లక్ష్మణ్ ను ఫోన్ లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకురాలు బానోత్ మనీషాలక్ష్మీ చిన్న కట్టుగూడెం గ్రామానికి చేరుకుని అంజి భౌతికాయానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఆమె వెంట మాజీ జడ్పీటీసీ జగన్, బీఆర్ఎస్ నాయకులు తాత వెంకన్న, డొంకన రవీందర్, మాజీ సర్పంచ్ జర్పుల హచ్చు, జంకిలాల్, బర్మావత్ కోటి, మురళి, మధు పాల్గొన్నారు.