Mahatma Gandhi | మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర.. వారణాసిలోని గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌కు చెందిన 12 భవనాల కూల్చివేత
జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది.
- వారణాసిలో 12 భవనాల కూల్చివేత
Mahatma Gandhi | వారణాసి: జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. అడ్డువచ్చిన గాంధేయవాదులను అదుపులోకి తీసుకుని ఆ ప్రాంగణంలో స్వతంత్ర సమరయోధుడు జయప్రకాశ్ నారాయణ సహవ్యవస్థాపకునిగా ఏర్పాటు చేసిన గాంధీ విద్యా సంస్థాన్ సహా పలు భవనాలను కూల్చివేసింది.
ఈ భవనాలకు చెందిన స్థలం తమదేనంటూ రైల్వే శాఖ వాదిస్తుండగా, దీనిని తాము అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని గాంధేయవాదులు చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా రైల్వేకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో వారు పోలీసు భద్రత మధ్య ఈ భవనాలను కూల్చివేశారు. కాగా, ఈ కూల్చివేతలను ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలు చరిత్రలో అవమానకర సంఘటనగా నిలిచిపోతుందని సర్వసేవా సంఘ అధ్యక్షుడు చందన్ పాల్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

