పాట్నా: బీహార్‌లోని ఎన్ఐటీ పాట్నాలో బీటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో శుక్రవారం రాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నది. ఘటనా స్థలిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య సమాచారాన్ని బంధువులకు తెలియజేశారు. అయితే బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యపై క్యాంపస్‌లోని విద్యార్థులంతా ఆందోళన నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.