న్యూఢిల్లీ : భారతీయ అధికారులకు పాకిస్థాన్ అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ కస్టడీలో 21 రోజులు తీవ్ర వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున సరిహద్దులను దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ రేంజర్లు అరెస్టు చేశారు.
షా కళ్లకు గంతలు కట్టి బందీగా ఉంచుకున్న పాకిస్థాన్ అధికారులు ఆయనను నిద్రపోనివ్వకుండా తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలిసింది. పళ్లు తోముకోవడానికి కూడా షాను అనుమతించ లేదు. సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ స్థావరాల వివరాలు చెప్పాలంటూ ఆయనను పాక్ అధికారులు ప్రశ్నించారని అధికార వర్గాలు తెలిపాయి. పాక్‌లో మూడు గుర్తుతెలియని ప్రదేశాలకు షాను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.