Jammu | జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భగ్నం చేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలోనే చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన భారీ చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు బీఎస్ఎఫ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. కాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారా? లేదా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు.
శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని బీఎస్ఎఫ్ అధికార వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్, కొన్ని ఇతర ప్రదేశాల్లోని సైనిక స్థావరాలను మిస్సైల్, డ్రోన్లతో దాడి చేసింది. భారత్ సైతం విజయవంతంగా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఎస్-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ధ్వంసం చేసింది.