శనివారం 16 జనవరి 2021
National - Jan 13, 2021 , 14:39:13

భారత్‌, పాక్‌ సరిహద్దులో సొరంగం

భారత్‌, పాక్‌ సరిహద్దులో సొరంగం

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో ఒక సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బుధవారం దీనిని కనుగొన్నారు. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భూగర్భ సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బోబియాన్ గ్రామంలో తనిఖీలు చేస్తుండగా ఈ టన్నెల్‌ విషయం తెలిసిందన్నారు. ఉగ్రవాదుల అక్రమ చొరబాట్ల కోసం ఈ టన్నెల్‌ను వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సొరంగం గురించి తెలిసిన వెంటనే బీఎస్ఎఫ్‌, పోలీస్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు అక్కడకు చేరుకుని దానిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు గురించి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.