ముంబై, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో చెరకు రైతులకు టన్నుకు రూ.5వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం చక్కర కార్ఖానాల మధ్య నిర్దిష్ట దూరం షరతును రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, షెత్కారి సంఘటన్ అధ్యక్షులు రఘునాథ్ దాదా పాటిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పుణేలోని చక్కెర కమిషన్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పులకుండవార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రఘునాథ్దాదాతో పాటు బీఆర్ఎస్ నాయకులు శివాజీ నాందకిలే, వస్తాదు దౌండ్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. చెరకు రైతుల బకాయిలను చెల్లించాలని కోరారు. హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల చెరకు రైతులకు ఒకే రకమైన ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.