Patna school | బీహార్ రాష్ట్రం పాట్నా (Patna)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడేళ్ల బాలుడు పాఠశాల డ్రైనేజీలో (drain) శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పాఠశాలకు వెళ్లిన మూడేళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. బాలుడి అదృశ్యంపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే, వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమాన పడ్డ బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో తీవ్రంగా గాలింపు చేపట్టారు. అక్కడ లోతైన డ్రైనేజీ గుంతలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు పాఠశాలకు నిప్పు పెట్టారు (family sets premises on fire). తమకు న్యాయం చేయాలంటూ స్థానికులతో కలిసి రోడ్డెక్కారు. అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పాఠశాలకు వెళ్లే రహదారులను కూడా దిగ్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, చిన్నారి పాఠశాలలోకి ప్రవేశిస్తున్నట్లు ఉంది కానీ, బయటకు వెళ్లడం కనిపించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పాట్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్ర ప్రకాశ్ తెలిపారు. ‘సీసీటీవీ ఫుటేజీలో బాలుడు పాఠశాలలోకి ప్రవేశిస్తున్నట్లు మేము చూశాము. కానీ అతను పాఠశాల ఆవరణ నుండి బయటకు వెళ్ళడం మాత్రం కనిపించలేదు. ఈ ఘటనపై హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకూ ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’ అని ఆయన మీడియాకు తెలిపారు.
#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY
— ANI (@ANI) May 17, 2024
Also Read..
PM Modi | అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును వారికి చెందేలా చేస్తాం : ప్రధాని మోదీ
Swati Maliwal | దాడి ఘటనలో స్వాతి మలివాల్ ముఖంపై అంతర్గత గాయాలు.. వైద్య పరీక్షల్లో వెల్లడి
Everest | ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై బ్యాన్ విధించిన నేపాల్