Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది. 2024 ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత ప్రఫుల్ వినోద్రావ్ గుడాడే కోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ స్పందన కోరింది. వాస్తవానికి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవిస్ చేతిలో వినోద్‌రావు 39,710 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. ఈ క్రమంలో కోర్టు సమాధానం చెప్పాలంటూ ముఖ్యమంత్రికి జస్టిస్ ప్రవీణ్ పాటిల్ బెంచ్ సమన్లు పంపింది. మే 8లోగా సమాధానం చెప్పాలని కోర్టు సూచించింది.