ముంబై: మైనర్‌ను వివాహం చేసుకున్నా, వారికి బిడ్డ పుట్టినా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ చట్టం కింద శిక్షను తప్పి ంచుకోలేరని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తిరస్కరించింది. 17 ఏళ్ల బాలికతో తనది సమ్మతితో కూడిన సంబంధం అని, ఆమెకు 18 ఏళ్లు నిండాకనే వివా హం చేసుకున్నామని నిందితుడు వాదించాడు.