Bombay High Court : ఇవాళ (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కు బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చిన ఘటనను మరువక ముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టు (Bombay High Court) కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాయర్లను, కేసుల విచారణ కోసం వచ్చిన ప్రజలను, కోర్టు సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ (Bomb squad) ను రప్పించి తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి బాంబు లేదని తనీఖీల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా అంతకు ముందు ఢిల్లీ హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో లాయర్లను, సిబ్బందిని హుటాహుటిన బయటికి పంపించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల ఎలాంటి బాంబుల ఆనవాళ్లు దొరకలేదు.