ముంబై, ఏప్రిల్ 27: రోడ్డు ప్రమాద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భౌతిక గాయాలతో పాటు మానసికంగా వారు పడిన వేదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2014లో నాసిక్ హైవేపై యాక్సిడెంట్‌కు గురైన ఇద్దరు మహిళలకు పరిహారం చెల్లించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ భారతి డాంగ్రే కొట్టేశారు. యాక్సిడెంట్ ఓ బాధితురాలికి జీవిత కాలం మానసికంగా బాధపడేలా చేసిందని, ఆమెకు నష్టపరిహారంతో పాటు చికిత్స కూడా అందించాలని ఆదేశించింది. యాక్సిడెంట్ బాధితురాలైన సమీర పటేల్‌కు రూ.20 లక్షలు, ఆమె కూతురు జులేకాకు రూ.22 లక్షలు పరిహారం చెల్లించాలని కంపెనీకి మోటార్ వెహికిల్స్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ 2019లో ఆదేశించింది.