ముంబై (నమస్తే తెలంగాణ) : 15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, పోక్సో కేసులో జైలులో ఉన్న నిందితునికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2020లో నవీ ముంబైకి చెందిన బాలిక యూపీ యువకుడిని ప్రేమించి.. అతనితో కలిసి పారిపోయింది. 10 నెలల తరువాత బాలిక గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో బాలిక తండ్రి ఆ యువకుడిపై పోక్సో కేసు పెట్టాడు. ఇప్పుడు నిందితుని బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాగా, బాంబే హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత.. ‘బాలిక మైనర్ అయినప్పటికి ఇష్ట ప్రకారమే యువకుడితో వెళ్లింది. తాను ఏం చేస్తుందో ఆమెకు అవగాహన ఉంది’ అని వ్యాఖ్యానిస్తూ బెయిల్ మంజూరు చేసింది.