Bomb threat : ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు.
దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అక్కడ అధికారులు తనిఖీలు చేసి అందులో బాంబులేదని తేల్చారు. దాంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపించారు. బెదిరింపు మెయిల్ రావడంతో విమానంలో ఉన్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.