న్యూఢిల్లీ, మే 10: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టుతోపాటు నగరంలోని 8 దవాఖానలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్వాడ్‌ను మోహరించారు. ఇప్పటివరకు ఎలాంటి బాంబులు దొరకలేదని చెప్పారు. గత నెల 30న కూడా కొన్ని దవాఖానలకు, ఈ నెల 1న ఢిల్లీలోని వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.