న్యూఢిల్లీ, జూన్ 21: అటవీ సమీప గ్రామంలోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వాల్పరై పట్టణంలో రోష్ని అనే చిన్నారి తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా, అడవిలో నుంచి వచ్చిన చిరుత పులి బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ అధికారులు సెర్చ్ లైట్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లతో కూడిన బృందాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.