ముంబై: మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు(Fishermen Boat) అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 80 శాతం బోటు ఆ ప్రమాదంలో కాలిపోయింది. అయితే బోటులో ఉన్న జాలర్లు సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. అందర్నీ రక్షించినట్లు అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గురైన బోటు నుంచి భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. దేని వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. బహుశా షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బోటులో ఉన్న చేపల వల వల్ల .. వేగంగా మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. మండుతున్న బోటును గుర్తించిన స్థానిక జాలర్లు.. అధికారుల్ని అప్రమత్తం చేశారు. అయితే వెంటనే ఆ బోటును తీరానికి తీసుకువచ్చి మంటల్ని ఆర్పారు. సకారాక్షి గ్రామానికి చెందిన రాకేశ్ మూర్తికి ఆ బోటు చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
fishing vessel caught fire near alibaug off Mumbai coast. all 14 crew reported safe. fishing boat tandel reported fire occurred in engine room whilst towing another disabled boat and all crew shifted to the boat being towed. @IndiaCoastGuard savitribai phule rushes to douse fire pic.twitter.com/R615jnI6g1
— dharmesh thakkar (@newzhit) February 28, 2025