చండీగఢ్, జూలై 17: మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదని పంజాబ్ సర్కారు కఠిన నిబంధనలకు తెరలేపింది. ఇటీవలే కొత్త ట్రాఫిక్ నిబంధనలకు ఆమోదం తెలిపింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా డ్రంకెన్ డ్రైవ్లో దొరికితే ఫైన్ చెల్లించడంతోపాటు రక్తదానం కూడా చేయాలి. లేదంటే సమీప దవాఖానలో కొన్ని గంటలపాటు రోగులకు సేవలు అందించాలి. లేదా పాఠశాల పిల్లలకు రెండు గంటలపాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి.