BJP Women MPs: విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌ను కోరిన బీజేపీ మహిళా ఎంపీలు
BJP Women MPs: స్పీకర్ ఓం బిర్లాకు ఇవాళ బీజేపీ మహిళా ఎంపీలు లేఖ రాశారు. ప్రధాని మోదీ సీటు వద్ద నిరసన చేపట్టిన విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 4వ తేదీన విపక్ష మహిళా ఎంపీలు.. లోక్‌సభలో ప్రధాని మోదీ సీటు వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీని వల్ల ఆ రోజు ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడలేకపోయారు. ఈ వివాదం లోక్‌సభలో ఇంకా కొనసాగుతున్నది. ఇవాళ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు(BJP Women MPs) లేఖ రాశారు. ఆ విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ఇదే తరహాలో విపక్ష ఎంపీలు స్పీకర్ బిర్లాకు లేఖ రాశారు. అన్యాయంగా తమను ఆరోపిస్తున్నట్లు ఆ లేఖలో మహిళా ఎంపీలు ఆరోపించారు.
రూల్స్ ప్రకారం ఆ ప్రతిపక్ష ఎంపీలపై కఠిన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎంపీలు తమ లేఖలో కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అగౌరవపరిచినట్లు ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిర్వహించిన తీరుపై స్పీకర్ బిర్లాను బీజేపీ మహిళా ఎంపీలు ప్రశంసించారు. సభా మర్యాదను, హుందాతనాన్ని కాపాడినట్లు పేర్కొన్నారు. ఆ రోజున లోక్‌సభ ఛాంబర్లో జరిగిన ఆ దురదృష్టకర సన్నివేశాన్ని యావత్ దేశం వీక్షించిందన్నారు. విపక్ష పార్టీ ఎంపీలు హౌజ్ వెల్‌లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్ టేబుల్‌పై ఎక్కే ప్రయత్నం చేసినట్లు లేఖలో ఆరోపించారు. పేపర్లను చింపేసి, స్పీకర్‌పై విసిరేశారన్నారు.
కొందరు మహిళా సభ్యులు దురుసుగా ప్రవర్తించారని, బ్యానర్లు.. ప్లకార్డులు పట్టుకుని మంత్రులు ఉన్న బెంచీల వైపు వెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని సీటును సీజ్ చేయడమే కాకుండా సీనియర్ మంత్రులు ఉండే ట్రెజరీ బెంచ్‌లను కూడా ఆ ఎంపీలు ఆక్రమించినట్లు లేఖలో ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

