Tejasvi Surya | దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య (Tejasvi Surya) ఇటీవలే ఓ ఇంటివాడు అయిన విషయం తెలిసిందే. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఈనెల 6న బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఆదివారం వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథులకు (Guests) ఎంపీ కీలక విజ్ఞప్తి చేశారు.
Dear well-wishers,
Sivasri & I are eagerly looking forward to see you all at our wedding reception tomorrow.
However, we have a request.
– In the 1 crore+ weddings that take place annually in India, 85% of wedding flowers & bouquets are discarded within 24 hours after the… pic.twitter.com/nM935GdAj1
— Tejasvi Surya (@Tejasvi_Surya) March 8, 2025
వివాహ విందుకు వచ్చే అతిథులు పువ్వులు, పూల బొకేలు, డ్రై ఫ్రూట్స్ తీసుకురావొద్దని (Wedding Gifts) కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వివాహం తర్వాత 24 గంటల్లోపే 85 శాతం పూలు, పూల బొకేలు పడేయాల్సి వస్తోందన్నారు. అంతేకాదు, ఏటా వివాహాల సమయంలో 300,000 కేజీల డ్రైఫ్రూట్స్ మిగిలిపోతున్నట్లు చెప్పారు. వీటి కారణంగా దేశంలో ఏటా రూ.315 కోట్లు వృథా అవుతోందని వివరించారు. వృథా ఖర్చులను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దయచేసి అతిథులెవరూ రిసెప్షన్‌కు పువ్వులు, పూల బొకేలు, డ్రైఫ్రూట్స్ తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. వివాహ విందుకు హాజరయ్యే దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తేజస్వి సూర్య తెలిపారు.
With the blessings of Gurus, elders, and well wishers, married @ArtSivasri today as per vedic traditions.
We seek your blessings and wishes as we start this journey together! pic.twitter.com/sguSVBRyJg
— Tejasvi Surya (@Tejasvi_Surya) March 6, 2025
Also Read..
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Lalit Modi | లలిత్ మోదీకి షాక్.. పాస్‌పోర్ట్ రద్దు చేయాలంటూ వనౌట్ ప్రధాని ఆదేశం
Thali prices | వెజ్ థాలీ ధర కిందికి.. నాన్‌వెజ్ థాలీ ధర పైకి : క్రిసిల్ నివేదిక