కోల్కతా : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతున్నది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వారి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన బంకురాలో పేర్కొన్నారు.
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీనిపాపి అని సంబోధిస్తూ, పాపులు జైలుకు వెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించారు. 2021లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను కూల్చివేసిన వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.