Delhi CM Atishi | బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే ఢిల్లీలో వాయు, జల కాలుష్యం పెరుగుతున్నదని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. శీతాకాలంలో పొగ మంచు కురియడం వల్ల రోజురోజుకు దేశ రాజధాని పరిధిలో వాయు నాణ్యత పడిపోతున్నది. యమునా నదీ తీరాన ప్రత్యేకించి కాళింది కుంజ్ వంటి ప్రాంతాల్లో చిక్కని విష రసాయనాల లేయర్లు ఏర్పడ్డాయని పరిశోధనల్లో తేలింది.
హర్యానాలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతున్నదని ఆమె ఆరోపించారు. ఢిల్లీలోని కౌసంబీ బస్ డిపో నుంచి ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దుల మీదుగా వేల డీజిల్ బస్సులు ప్రయాణం చేస్తాయని, హర్యానాలో రైతులు ప్యాడీ స్టబుల్ దహనం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కానీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే ప్రజలకు సాయం చేస్తుందన్నారు.