కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో (Kolkata Hospital) ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సీజీవో కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, కోల్‌కతా పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం నిరసనలకు సంఘీభావంగా పశ్చిమ బెంగాల్లో 12 గంటల సార్వత్రిక సమ్మెకు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హజ్రా కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన ఎస్‌యూసీఐ(సీ) కార్యకర్తలు, పోలీసుల మధ్య కూడా ఘర్షణ జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా వైద్యులు, వివిధ వైద్య సంస్థల ప్రతినిధులు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
#WATCH | Kolkata, West Bengal: A clash broke out between BJP leaders and police outside CGO Complex during BJP's protest over the RG Kar's Medical College and Hospital incident. The police have detained the protestors. pic.twitter.com/20UGmbnZvr
— ANI (@ANI) August 16, 2024