వడోదరా: డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్లు ఆద్య బహెతీ, రాజ్‌దీప్ బిశ్వాస్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన బాలికల అండర్-11 విభాగం ఫైనల్లో ఆద్య 15-13, 11-8, 12-10తో సాక్ష్య సంతోష్‌పై అద్భుత విజయం సాధించింది. బాలుర తుదిపోరులో రాజ్‌దీప్ బిశ్వాస్ 11-8, 11-6, 11-13, 11-4తో శార్విల్ కరమ్బేల్కర్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
బాలుర అండర్-15విభాగంలో వివియన్ దేవ్ 9-11, 11-9, 11-6, 11-3తో రిశాన్ చటోపాధ్యాయపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బాలికల కేటగిరీలో అంకోలిక చక్రవర్తి, నైశా రేవాస్కర్ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.