Jairam Ramesh: రిజర్వేషన్ను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్: జయరాం రమేశ్
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమంలోనే టీఎంసీ, శివసేన యూబీటీ పార్టీల్లో చీలికలు తెచ్చినట్లు ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్సభలో మూడవ వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని, దాంతో రిజర్వేషన్లను అంతం చేయాలని ఆ పార్టీ చూస్తున్నట్లు కాంగ్రెస్ నేత జయరాం రమేశ్(Jairam Ramesh) ఆరోపించారు. మూడో వంతు మెజారిటీ రాగానే రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ తొలుత మహిళా రిజర్వేషన్ బిల్లు నెపంతో డీలిమిటేషన్ బిల్లును తెచ్చిందని, దాని ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ను అంతం చేయడమే అవుతుందన్నారు. ఒకవేళ మహిళ రిజర్వేషన్ పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంటే, అప్పుడు నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లును ప్రస్తుత లోక్సభ సామర్థ్యంతో అమలు చేయాలని జయరాం రమేశ్ డిమాండ్ చేశారు.
టీఎంసీ, శివసేన యూబీటీ చీలకలో కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీకి 400 సీట్ల రావాలన్న కాంక్ష ఉందని, దాని కోసం రాజ్యాంగాన్ని సవరణ చేసి, రిజర్వేషన్ను అంతం చేయాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీన లోక్సభలో డీలిమిటేషన్ బిల్లులు పాస్ కాకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. బుల్డోజ్ చేసైనా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించాలని మంత్రి షా ప్రయత్నించారని, కానీ ఆయన విఫలమైనట్లు రమేశ్ తెలిపారు. ఆ రోజు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని షా విభిన్న రాజనీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు. లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం టీఎంసీ, శివసేనలో చీలిక తెచ్చారన్నారు.
STORY | BJP wants 2/3rd majority in Lok Sabha as its ‘real target’ is to end reservation: Congress
The Congress on Wednesday alleged that the BJP is striving for a two-thirds majority in the Lok Sabha, as its “real and ultimate target” is to be able to amend the Constitution for… pic.twitter.com/AEMnOhDNQJ
— Press Trust of India (@PTI_News) June 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

